Rakul: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • ఇట్టే కలసిపోతానంటున్న రకుల్
  • బాలకృష్ణ, వినాయక్ చిత్రానికి ముహూర్తం 
  • హిట్ చిత్రానికి సీక్వెల్ మొదలు

*  ఎవరితోనైనా సరే తాను ఇట్టే కలసిపోతానని చెబుతోంది కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్. 'కొత్త వ్యక్తులైనా, కొత్త ప్రదేశాలన్నా నాకేమీ భయం వుండదు. ఎక్కడైనా, ఎవరితోనైనా సరే కలసిపోతాను. సినిమా రంగంలో ఇది నాకు బాగా హెల్ప్ అవుతోంది' అని చెప్పింది. అలాగే తాను సమయ పాలన పాటిస్తానని, అలా పాటించే వాళ్లంటే తనకు ఎంతో గౌరవమని కూడా చెప్పింది.
*  నందమూరి బాలకృష్ణ, వీవీ వినాయక్ కాంబినేషన్లో రూపొందే చిత్రం షూటింగ్ ఈ నెల 27న ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. సి.కల్యాణ్ నిర్మించే ఈ భారీ చిత్రానికి  దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తాడట.  
*  ఐదేళ్ల క్రితం వచ్చిన 'ప్రేమకథా చిత్రం' అప్పట్లో విజయాన్ని సాధించింది. దీంతో ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ నిర్మిస్తున్నారు. సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్న ఈ 'ప్రేమకథా చిత్రం 2' సినిమాకి నూతన దర్శకుడు హరికిషన్ దర్శకత్వం వహిస్తున్నాడు.  

  • Loading...

More Telugu News