murali mohan: మురళీమోహన్ పై చంద్రబాబు చమక్కు!

  • మురళీమోహన్ మంచి నటుడు, నిర్మాత
  • పార్టీకి మాత్రం సరిగా ఉపయోగపడటం లేదన్న చంద్రబాబు
  • సమయం సరిపోవడం లేదన్న మురళీమోహన్
టీడీపీ ఎంపీ, సినీ నటుడు మురళీమోహన్ ను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు సరదా వ్యాఖ్యలు చేశారు. మురళీ మోహన్ ఒక మంచి నటుడని, సినీ నిర్మాత అని... కానీ, పార్టీకి మాత్రం సరిగా ఉపయోగపడటం లేదని చమత్కరించారు. ఎంపీగా తన సమయం సరిపోవడం లేదని మురళీమోహన్ ఈ సందర్భంగా చెప్పారు. మరోవైపు చంద్రబాబు మాట్లాడుతూ, ఇసుక రవాణాను అరికట్టడం, బెల్టు షాపులను నియంత్రించడం లాంటి పనులను స్థానిక నేతలు పర్యవేక్షించాలని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు వీటిపై దృష్టి సారించాలని తెలిపారు.
murali mohan
Chandrababu

More Telugu News