caste: అసలు కులం గురించి అడగడం ఏంటీ?: వర్ల రామయ్యపై వైసీపీ ఎంపీ వరప్రసాద్‌ మండిపాటు

  • వర్ల రామయ్య పిల్లలు ఫోన్లు వాడరా?
  • పేదలకు ఒక న్యాయం, రామయ్య బిడ్డలకు ఒక న్యాయమా?
  • తన స్థాయిని మరచి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఏంటీ?
కృష్ణా జిల్లా మచిలీపట్నం బస్టాండ్‌లో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్, టీడీపీ నేత వర్ల రామయ్య బస్సులోని ఓ ప్రయాణికుడిని కులం ఏంటని అడిగి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తనను పట్టించుకోకుండా ఆ ప్రయాణికుడు ఫోను చూసుకుంటూ కూర్చోవడంతో ఆయన కోపం నషాలానికి అంటి.. మీ అయ్య ఏం పనిచేస్తాడు? మీ అమ్మ ఏం చేస్తుంది? అంటూ మాట్లాడారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత, ఎంపీ వరప్రసాద్‌ మండిపడ్డారు.

వర్ల రామయ్య పిల్లలు ఫోన్లు వాడరా? అని ప్రశ్నిస్తూ... పేదలకు ఒక న్యాయం, రామయ్య బిడ్డలకు ఒక న్యాయమా? అని వరప్రసాద్‌ నిలదీశారు. ఇలా కులం గురించి అడగటం ఏంటని, తన స్థాయిని మరచి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు. పక్కనున్న టీడీపీ నాయకులు వర్ల రామయ్యను ఇంకాస్త రెచ్చగొట్టారని అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు కూడా దళితులను ఉద్దేశించి దారుణంగా మాట్లాడి, కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదని అన్నారు.
caste
varla ramaiah
Telugudesam

More Telugu News