surya: సూర్య మూవీలో కీలకమైన పాత్రలో మోహన్ లాల్

  • కేవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్య 
  • ఈ కాంబినేషన్లో ఇది మూడో సినిమా
  • త్వరలోనే సెట్స్ పైకి      

జయాపజయాలను గురించి పెద్దగా పట్టించుకోకుండా, సూర్య వరుస సినిమాలు చేస్తూ వెళుతుంటాడు. అలా ప్రస్తుతం ఆయన సెల్వరాఘవన్ దర్శకత్వంలో 'ఎన్ జి కె' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత కేవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్య ఒక సినిమా చేయనున్నాడు.

గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అవి తెలుగులో 'వీడొక్కడే' .. 'బ్రదర్స్' పేరుతో అనువాదాలుగా వచ్చాయి. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్లో మూడవ సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయి . ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర ఉందట. ఈ పాత్ర సినిమాకి హైలైట్ గా నిలవనుండటంతో, స్టార్ ఇమేజ్ కలిగిన సీనియర్ హీరోతోనే ఈ పాత్రను చేయించాలని భావించిన దర్శకుడు, తాజాగా మోహన్ లాల్ ను ఎంపిక చేసుకున్నట్టు ఈ సినిమాను నిర్మిస్తోన్న లైకా ప్రొడక్షన్స్ వారు చెప్పారు.    

More Telugu News