Tirumala: తిరుమల నుంచి తిరుగు ప్రయాణంలో అమిత్ షా కాన్వాయ్ పై రాళ్ల దాడి!

  • నేడు తిరుమలకు వచ్చిన అమిత్ షా
  • వచ్చేటప్పుడు, పోయేటప్పుడు హోదా సెగ
  • పటిష్ఠ భద్రత మధ్య రేణిగుంట ఎయిర్ పోర్టుకు అమిత్ షా
ఈ ఉదయం తిరుమలకు వచ్చిన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ప్రత్యేక హోదా సెగ తగులగా, స్వామి దర్శనానంతరం తిరుగు ప్రయాణంలో మరోసారి ప్రజాగ్రహం ఆయనకు కనిపించింది. ఆయన వెళుతున్న కాన్వాయ్ పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వడంతో బీజేపీ నేతలు ప్రయాణిస్తున్న కాన్వాయ్ లోని కార్ల అద్దాలు పగిలాయి. అంతకుముందు అమిత్ షాకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నినాదాలతో హోరెత్తిస్తూ, రోడ్డును స్తంభింపజేయగా, బీజేపీ శ్రేణులకు వారికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. నిరసనకారులను ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులు, సాధారణ ట్రాఫిక్ ను నిలిపివేశారు. అత్యంత పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులు, ఆయన కాన్వాయ్ ని భద్రంగా రేణిగుంట ఎయిర్ పోర్టునకు చేర్చారు.
Tirumala
Tirupati
Amit sha
Renigunta
Telugudesam
Andhra Pradesh
Special Category Status

More Telugu News