MAA: తప్పని పరిస్థితుల్లోనే మేమంతా హైదరాబాదులో ఉండాల్సి వస్తోంది: నటుడు నరసింహరాజు

  • ఏపీలో సినీ పరిశ్రమకు అన్ని వసతులు కల్పించాలి
  • సొంత రాష్ట్రానికి రావడానికి మాకు అభ్యంతరం లేదు
  • సినీ పరిశ్రమపై ప్రభుత్వం దృష్టి సారించాలి
  • లేకపోతే మరో పదేళ్లయినా ఏపీకి ఫిల్మ్ ఇండస్ట్రీ వచ్చే అవకాశం ఉండదు

సినీ నటులు, టెక్నీషియన్లకు ఏపీకి రావాలనే కోరిక ఉన్నప్పటికీ... విధిలేని పరిస్థితుల్లో హైదరాబాదులోనే ఉండాల్సి వస్తోందని సీనియర్ నటుడు నరసింహరాజు అన్నారు. ఏపీలో సీని పరిశ్రమకు సరైన వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తే సొంత రాష్ట్రానికి రావడానికి ఎవరికీ అభ్యంతరం లేదని అన్నారు.

ఏపీలో వసతులు మెరుగైతే పరిశ్రమ మొత్తం తరలి వస్తుందని చెప్పారు. స్టూడియోలను నిర్మిస్తామని చెప్పి భూములను తీసుకుని, వాటిని నిర్మించని వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సినీ పరిశ్రమపై ప్రభుత్వం దృష్టి సారించాలని... లేకపోతే మరో పదేళ్లయినా ఏపీకి సినీ పరిశ్రమ తరలి వచ్చే అవకాశం ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సమావేశంలో నరసింహరాజు మాట్లాడుతూ, పైవిధంగా స్పందించారు.

More Telugu News