siddaramaiah: తెలుగువారి అండతో ఘన విజయం సాధిస్తాం: సిద్ధరామయ్య

  • హోదా ఇస్తామని మోసం చేసిన మోదీని తెలుగువారు నమ్మడం లేదు
  • కర్ణాటకలోని తెలుగువారి ఓట్లన్నీ కాంగ్రెస్ కే
  • బీజేపీకి గుణపాఠం నేర్పబోతున్నాం
కర్ణాటకలో బీజేపీని ఓటమి భయం వెంటాడుతోందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. నాలుగేళ్ల కాలంలో విజయాలనే కాకుండా, వైఫల్యాలను సైతం ప్రధాని మోదీ చవిచూశారని చెప్పారు. కర్ణాటకలో ఉన్న తెలుగువారంతా బీజేపీని నమ్మడం లేదని, వారంతా కాంగ్రెస్ వెంటే ఉన్నారని తెలిపారు.

తెలుగువారంతా తమకే ఓటు వేస్తారని... వారి అండతో కాంగ్రెస్ ఘన విజయం సాధించబోతోందని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి, మోసం చేసిన మోదీని తెలుగువారు నమ్మడం లేదని అన్నారు. కాంగ్రెస్ కు 120కి పైగా సీట్లు వస్తాయని... హంగ్ వచ్చే ప్రసక్తే లేదని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం నేర్పబోతున్నామని అన్నారు. 
siddaramaiah
Narendra Modi
karnataka
telugu
people
elections
BJP
Congress

More Telugu News