militant: సంచలనంగా మారిన లష్కరే ఉగ్రవాది వీడియో.. హింసా మార్గాన్ని వీడాలంటూ స్నేహితులకు పిలుపు!

  • భారత  సైన్యం ఎంతో మంచిది
  • చంపే అవకాశం ఉన్నప్పటికీ, కొత్త జీవితాన్ని ప్రసాదించింది
  • రండి.. అందరూ బయటకు రండి
  • లష్కరే ఉగ్రవాది ఐజాజ్  

లష్కరే తాయిబాకు చెందిన ఓ ఉగ్రవాది విడుదల చేసిన వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. పాకిస్థాన్‌పై విరుచుకుపడిన అతడు హింసామార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలని, కుటుంబ సభ్యుల బాగోగులు చూసుకోవాలని స్నేహితులకు పిలుపునిచ్చాడు.

‘‘నా పేరు ఐజాజ్ అహ్మద్ గోజ్రీ. కుటుంబాలను వదిలిపెట్టి హింసామార్గంలో పయనిస్తున్న నా స్నేహితులు సుహైబ్ అఖూన్, మొహ్సిన్ ముస్తాక్ భట్, నాసిర్, అమీన్ ద్రాజీలకు ఇదే నా విన్నపం. అందమైన జీవితాన్ని, కుటుంబాలను వదులుకుని హింసామార్గాన్ని ఎంచుకుని అడవుల్లోకి వెళ్లిన మీరంతా తిరిగి ఇళ్లకు వచ్చేయండి. నాసిర్.. మీ అమ్మ అనారోగ్యంతో బాధపడుతోంది. ఇంటికొచ్చెయ్’’ అని పిలుపునిచ్చాడు. రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయింది.

ఉత్తర కశ్మీర్‌లో బుధవారం పదిమంది లష్కరే తాయిబా ఉగ్రవాదులను సైన్యం అదుపులోకి తీసుకుంది. వీరిలో నలుగురు.. బారాముల్లాలో ముగ్గురు బాలలను కాల్చి చంపిన కేసులో నిందితులు.  తాము సైన్యంపై కాల్పులు జరిపినా సైన్యం మాత్రం ఎదురుకాల్పులు జరపలేదని, తమను కాల్చి పడేసే అవకాశం ఉన్నా ఆ పని చేయకుండా అరెస్ట్ చేసి కొత్త జీవితం ప్రసాదించిందని గోజ్రీ పేర్కొన్నాడు. పాకిస్థాన్‌లో ఉన్న తమ నేతలు ఇక్కడి యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని, తమ జీవితాలతో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. భారత ఆర్మీ గురించి తమకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News