London: విదేశాల్లో విద్యనభ్యసించేందుకు ఈ నగరం ఉత్తమం!

  • విదేశాల్లో చదువు కోసం లండన్ కే మొగ్గు 
  • లండన్ అన్ని విధాలుగా ఎంతో సౌకర్యంగా ఉంటుంది
  • క్యూఎస్ వరల్డ్ ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్ సంస్థ సర్వేలో వెల్లడి

విదేశాల్లో విద్యనభ్యసించాలనుకునే వారికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నగరాల్లో కెనడాలోని మాంట్రియల్ నగరం గత ఏడాది వరకు అగ్రస్థానంలో ఉండేది. అయితే, ఆ స్థానంలో ఇప్పుడు లండన్ వచ్చి చేరింది. ఈ విషయాన్ని క్యూఎస్ వరల్డ్ ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్ సంస్థ పేర్కొంది. విదేశాల్లో విద్యనభ్యసించాలనుకునే వారికి లండన్ ఉత్తమ నగరమని ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.

‘ఏ దేశంలోని యూనివర్శిటీల్లో విద్యార్థులు చదువుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు? ఆ దేశంలో జీవనశైలి ఎలా ఉంది? వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ సర్వే నిర్వహించారు. లండన్ అన్ని విధాలుగా ఎంతో సౌకర్యంగా ఉంటుందని, అక్కడ గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత అక్కడే స్థిరపడాలని, చదువు పూర్తయిన అనంతరం ఉద్యోగావకాశాలు అక్కడ ఎక్కువగా ఉంటాయని అధికశాతం విద్యార్థులు అభిప్రాయపడ్డారని సర్వేలో తెలిపింది.

కాగా, విదేశాల్లో విద్యనభ్యసించదలచిన విద్యార్థులకు లండన్ తర్వాత టోక్యో, మెల్ బోర్న్, మాంట్రియల్, పారిస్, మ్యునిచ్, బెర్లిన్, జ్యురిచ్, సిడ్నీ, సియోల్ నగరాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.  

More Telugu News