varla ramaiah: తనను పట్టించుకోని ప్రయాణికుడిపై వర్ల రామయ్య అనుచిత వ్యాఖ్యలు!

  • మచిలీపట్నం బస్టాండ్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన వర్ల
  • తనను పట్టించుకోని ఓ ప్రయాణికుడిన మందలించిన వైనం 
  • ఆ ప్రయాణికుడి కులం గురించి అడిగి తెలుసుకున్న వర్ల 
ఏపీఎ స్ఆర్టీసీ చైర్మన్, టీడీపీ నేత వర్ల రామయ్య వివాదంలో చిక్కుకున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం బస్టాండ్ లో ఈరోజు ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అయితే, ఓ బస్సులోని ఓ ప్రయాణికుడు ఇదేమీ పట్టించుకోకుండా తన మొబైల్ ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు. ఇది గమనించిన వర్ల రామయ్య ఆ ప్రయాణికుడి కులం గురించి అడిగి తెలుసుకుని అనుచిత వ్యాఖ్యలు చేశారు.

ఇందుకు సంబంధించిన వీడియోలు మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. ‘బస్సు ఎక్కాం..దిగాం..వాడు మాత్రం మనను వినడం లేదు. అది డేంజర్.. వాళ్ల నాన్నకు వీడేమీ ఉపయోగపడడు..’ అని రామయ్య వ్యాఖ్యానించారు. సదరు ప్రయాణికుడిని ‘నువ్వు మాల, మాదిగ?’ అని ప్రశ్నించారు. ‘మీ అయ్య ఏం పనిచేస్తాడు? మీ అమ్మ? ఎన్ని ఎకరాల పొలం ఉంది. బ్యాంకులో ఎన్ని లక్షలు ఉన్నాయి. మరి ఎట్లా చదువుకుంటావు?’ అని మందలించారు.
varla ramaiah
machilipatnam

More Telugu News