Tollywood: ‘నా పేరు సూర్య’ థ్యాంక్స్ మీట్ కు రాలేకపోతున్నా!: హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్

  • దురదృష్టవశాత్తు థ్యాంక్స్ మీట్ కు రాలేకపోతున్నా
  • నిజంగా వద్దామనుకున్నా.. కుటుంబ కారణాల వల్ల కుదరట్లేదు
  • ఈ చిత్రం నాకు ఎంతో ప్రత్యేకమైంది

‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ సక్సెస్ మీట్ ఈరోజు హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన అనూ ఇమ్మాన్యుయేల్ నటించింది. ఈ చిత్రం సక్సెస్ మీట్ కు తాను హాజరుకాలేకపోతున్నానంటూ అనూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది.

‘దురదృష్టవశాత్తు నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా థ్యాంక్స్ మీట్ కు రాలేకపోతున్నా. నిజంగా వద్దామనే అనుకున్నాను కానీ, కుటుంబ కారణాల వల్ల కుదరట్లేదు. ఈ చిత్రం నాకు ఎంతో ప్రత్యేకమైంది. ఈ చిత్రంలో నాకు అవకాశం లభించడం గొప్పగా భావిస్తున్నాను.. థ్యాంక్యూ’ అని తన ట్వీట్ లో అనూ పేర్కొంది.

  • Loading...

More Telugu News