Chandrababu: వైయస్ హయాంలో సీమకు కేవలం ఒక్క పరిశ్రమ మాత్రమే వచ్చింది: చంద్రబాబు

  • రాయలసీమలో ఒకప్పుడు రాళ్లు మాత్రమే ఉండేవి
  • నాలుగేళ్లలో ఎన్నో పరిశ్రమలను తీసుకొచ్చా
  • కేసుల భయంతో బీజేపీకి వైసీపీ వత్తాసు పలుకుతోంది

రాయలసీమలో ఒకప్పుడు రాళ్లు మాత్రమే ఉండేవని... నాలుగేళ్ల వ్యవధిలో తాను ఎన్నో పరిశ్రమలను ఈ ప్రాంతానికి తీసుకొచ్చానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుట్టపాడు సమీపంలో ఈరోజు జైరాజ్ ఇస్పాత్ లిమిటెడ్ స్టీల్ ప్లాంట్ కు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అనంతరం పారిశ్రామికవేత్తలు, మీడియాతో ఆయన ముఖాముఖి నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కర్నూలు జిల్లాను పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు. మరిన్ని సంస్థలు కర్నూలు జిల్లాకు రాబోతున్నాయని తెలిపారు. కొత్త పరిశ్రమల వల్ల 80 వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా సంస్థలు ముందుకొస్తున్నాయని తెలిపారు. కేసుల నుంచి బయటపడేందుకు బీజేపీకి వైసీపీ వత్తాసు పలుకుతోందని విమర్శించారు. వైయస్ సీఎంగా ఉన్న సమయంలో రాయలసీమకు కేవలం ఒకే ఒక పరిశ్రమ వచ్చిందని చెప్పారు. 

  • Loading...

More Telugu News