BSNL: బీఎస్ఎన్ఎల్ నుంచి బంపరాఫర్... 10 రోజుల వ్యాలిడిటీతో రూ.39కే అన్ లిమిటెడ్ కాల్స్

  • రోజూ 100 ఎస్ఎంఎస్ లు కూడా ఫ్రీ
  • ఉచిత డేటా సదుపాయం లేదు
  • 10 రోజుల వ్యాలిడిటీ

ప్రైవేటు టెలికం కంపెనీలకు దీటుగా బీఎస్ఎన్ఎల్ కూడా ఆఫర్లతో పోటీ పడుతోంది. ప్రభుత్వరంగ బీఎస్ఎన్ఎల్ తాజాగా రూ.39కే అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో ఓ ప్రీపెయిడ్ ప్లాన్ ను ప్రకటించింది. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 10 రోజులు. రోజూ 100 ఎస్ఎంఎస్ లు కూడా ఉచితంగా లభిస్తాయి. కాల్స్ విషయంలో ఎటువంటి పరిమితులు ఉండవు.

దేశవ్యాప్తంగా ఎక్కడికైనా, ఏ నంబర్ కు అయినా ఉచితంగానే మాట్లాడుకోవచ్చు. అయితే, ఢిల్లీ, ముంబై రీజియన్లలో వారికి ఈ ప్లాన్ అందుబాటులో ఉండదు. ఈ ప్యాక్ కేవలం వాయిస్ కాల్స్ కోసమే. ఇందులో డేటా ఆఫర్ లేదు. పోటీ కంపెనీ జియోలో రూ.52 ప్యాక్ లో 7 రోజుల వ్యాలిడిటీతో, 1 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్ కు అవకాశం ఉంది.

More Telugu News