chiranjeevi: చిరూతో బోయపాటి మూవీ మరింత ఆలస్యం?

  • 'సైరా'తో బిజీగా చిరంజీవి 
  • నెక్స్ట్ ప్రాజెక్టు కొరటాలతో 
  • ఆ తరువాతనే బోయపాటితో
ప్రస్తుతం బోయపాటి .. చరణ్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన తాజా షెడ్యూల్ ను బ్యాంకాక్ లో ప్లాన్ చేశారు. ఈ సినిమా తరువాత చిరంజీవితో బోయపాటి చేయవలసి వుంది. 'సరైనోడు' సమయంలోనే అల్లు అరవింద్ నిర్మాతగా మాటలు జరిగిపోయాయి. 'సైరా' సినిమాను పూర్తి చేసుకుని ఆయనతో చిరంజీవి సెట్స్ పైకి వెళ్లవలసి వుంది.

అయితే రీసెంట్ గా చిరంజీవికి .. కొరటాలకి మధ్య కథా చర్చలు జరిగాయి. కొరటాల వరుస హిట్లను ఇస్తూ ఉండటం .. ఆయన చెప్పిన కథలోని పాయింట్ కొత్తగా ఉండటంతో వెంటనే చిరూ ఓకే చెప్పారట. అందువలన 'సైరా' పూర్తి కాగానే కొరటాలతోనే చిరూ సినిమా ఉండొచ్చునని అంటున్నారు. ఆ తరువాతనే ఆయన బోయపాటితో చేసే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.    
chiranjeevi
Koratala Siva

More Telugu News