Hyderabad: కిడ్నీ కేసులో.. బాలాజీని విచారించిన బంజారాహిల్స్ పోలీసులు!

  • కిడ్నీ తీసుకున్నారని ఫిర్యాదు చేసిన భాగ్యలక్ష్మి
  • చట్ట ప్రకారమే వ్యవహారం సాగిందా? అన్న కోణంలో విచారణ
  • దర్యాఫ్తు సాగుతోందన్న పోలీసులు

తన భార్యకు కిడ్నీ కోసం నటుడు బాలాజీ మభ్యపెట్టి మోసం చేశాడని ఆరోపిస్తూ పోలీసు కేసు పెట్టిన నటి భాగ్యలక్ష్మి ఫిర్యాదు ఆధారంగా బంజారాహిల్స్ పోలీసులు విచారణ ప్రారంభించారు. కిడ్నీ మార్పిడి వ్యవహారం చట్ట ప్రకారం సాగిందా? లేదా? అన్న కోణంలో విచారించిన పోలీసులు బాలాజీని పలు ప్రశ్నలు అడిగారు.

భాగ్యలక్ష్మి నుంచి కిడ్నీ సేకరణకు ముందు జరిగిన చర్చలు, రాతకోతలపై వివరాలు అడిగారు. తాము చట్ట ప్రకారం ఆమె నుంచి కిడ్నీ తీసుకున్నామని, ఒప్పంద పత్రాలపై సంతకాలు తీసుకున్నామని, తాను మానవతా దృక్పథంతో ఆమెపట్ల వ్యవహరించానని బాలాజీ చెప్పాడని తెలుస్తోంది. ఈ కేసు విషయంలో దర్యాఫ్తు సాగుతోందని పోలీసులు తెలిపారు. కాగా, తనకు సినిమాల్లో వేషాలతో పాటు రూ. 20 లక్షలు ఇస్తానని ఆశ పెట్టి కిడ్నీ తీసుకున్నారని భాగ్యలక్ష్మి కేసు పెట్టిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News