YSRCP: నేడు వైసీపీలోకి మాజీ హోమ్ మంత్రి కుమారుడు!

  • ఇంటి నుంచి భారీ ర్యాలీ
  • జగ్గయ్యపేట, నందిగామ మీదుగా కైకలూరు వరకూ
  • స్వయంగా పార్టీలోకి ఆహ్వానించనున్న జగన్
సీనియర్ నేత, హోమ్ శాఖ మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు వసంత కృష్ణ ప్రసాద్, నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన అనుచరులు పూర్తి చేశారు. ఈ ఉదయం వైఎస్ జగన్ ను స్వయంగా కలిసే వసంత, ఆపై వైకాపా జండాను కప్పుకోనున్నారు.

ఇందుకోసం నందిగామ మండలం ఐతవరంలోని తన ఇంటి నుంచి భారీ ర్యాలీగా కృష్ణ ప్రసాద్ వెళ్లనున్నారు. జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం ప్రాంతాల నుంచి భారీగా వసంత అభిమానులు ఈ ర్యాలీలో జతకానుండగా, ప్రస్తుతం కైకలూరు సమీపంలో పాదయాత్రలో ఉన్న జగన్ వద్దకు ర్యాలీ వెళుతుంది. ఆపై కృష్ణ ప్రసాద్ ను పార్టీలోకి ఆహ్వానించే జగన్, ప్రజలు, అభిమానులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇప్పటికే కృష్ణ ప్రసాద్ ర్యాలీ ప్రారంభమై సందడిగా సాగుతోంది.
YSRCP
Jagan
Vasanta
Krishnaprasad

More Telugu News