Narendra Modi: మోదీజీ! రాహుల్ ని ఎగతాళి చేయకండి: ‘శివసేన’ ఎంపీ సంజయ్ రౌత్

  • ప్రధాని కావాలన్న కోరికను రాహుల్ వెలిబుచ్చితే తప్పేంటి?
  • ప్రజాస్వామ్య దేశంలో రాహుల్ కు అన్ని హక్కులూ ఉన్నాయి
  • రాహుల్ ని ప్రధాని కాకుండా ఆపాలంటే ముందుగా ఆయన్ని ఓడించండి
2019 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తాను ప్రధానిని అవుతానేమోనని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ విమర్శలపై శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రధాని కావాలన్న తన కోరికను వెలిబుచ్చడానికి రాహుల్ గాంధీకి అన్ని హక్కులూ ఉన్నాయని, మోదీ ప్రధాని కావడానికి ఆ హక్కే కారణమని అన్నారు.

ఈ విషయమై రాహుల్ ని ఎగతాళి చేయాల్సిన అవసరం లేదని హితవు పలికారు. రాహుల్  గాంధీని ప్రధాని కాకుండా ఆపాలంటే ముందుగా ఆయన్ని గెలవకుండా అడ్డుకోవాలని చెప్పిన సంజయ్ రౌత్, కాంగ్రెస్ మిత్ర పక్షానికి చెందిన శరద్ పవార్ కూడా ప్రధాని పదవికి అర్హుడేనని అన్నారు. అదేవిధంగా, బీజేపీలో అద్వానీ, అరుణ్ జైట్లీ లు కూడా ప్రధాని పదవికి పోటీదారులేనని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
Narendra Modi
rahul
siva sena

More Telugu News