air odissa: విశాఖ నుంచి జగదల్ పూర్ కు తక్కువ ధరకే విమాన ప్రయాణం
- ఉడాన్ పథకం కింద ‘ఎయిర్ ఒడిశా’ సేవలు
- విశాఖ నుంచి ఛత్తీస్ గఢ్ లోని జగదల్ పూర్ కు విమాన సౌకర్యం
- టికెట్ ధర రూ.1,630 మాత్రమే
సామాన్యులకు విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చే నిమిత్తం కేంద్ర పౌర విమానయాన శాఖ ఉడాన్ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద విశాఖపట్టణం నుంచి ఛత్తీస్ గఢ్ లోని జగదల్ పూర్ కు వెళ్లేందుకు ‘ఎయిర్ ఒడిశా’ సేవలు అందుబాటులోకి రానున్నాయి. జూన్ 15 నుంచి ఈ మార్గంలో ఎయిర్ ఒడిశా సేవలను ప్రారంభించనుంది. ఈ మేరకు ‘ట్విట్టర్’ ద్వారా ఓ ప్రకటన చేసింది. విశాఖ - జగదల్ పూర్ మార్గంలో ప్రయాణానికి సంబంధించి టికెట్ బుకింగ్స్ ప్రారంభించినట్టు తెలిపింది.
కాగా, ఉదయం 9.10 గంటలకు జగదల్ పూర్ నుంచి బయలుదేరి 9.45 గంటలకు విశాఖపట్టణం విమానాశ్రయానికి ఈ విమానం చేరుకుంటుందని, తిరిగి మర్నాడు ఉదయం 10.10 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 10.50 గంటలకు జగదల్ పూర్ చేరుకుంటుందని, టికెట్ ధర రూ.1,630 మాత్రమే ఉంటుందని ‘ఎయిర్ ఒడిశా’ పేర్కొంది.