లాలూ కుటుంబానికి సంబంధించి 20వేల డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించిన సీబీఐ
- ఐఆర్సీటీసీ కుంభకోణంపై సీబీఐ విచారణ
- నెల క్రితం రబ్రీ, తేజస్విలను విచారించిన సీబీఐ
- క్విడ్ ప్రోకో జరిగిందని వాదిస్తున్న సీబీఐ
2006లో రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఐఆర్సీటీసీకి చెందిన రెండు హోటళ్ల మెయింటెనెన్స్ కాంట్రాక్టులను ఓ ప్రైవేట్ కాంట్రాక్టరుకు అప్పగించారు. ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్ కు, లాలూ కుటుంబానికి మధ్య క్విడ్ ప్రోకో జరిగిందని... మూడెకరాల విలువైన భూమిని లాలూ ప్రసాద్ లంచంగా తీసుకున్నారని సీబీఐ వాదిస్తోంది. ఈ కుంభకోణంలో లాలూ కుటుంబసభ్యులు కూడా ఉన్నారని ఆరోపిస్తోంది.