bhanu kiran: అక్రమ ఆయుధాల కేసులో సూరి హత్యకేసు నిందితుడు భానుకిరణ్ కు ఏడాది జైలు శిక్ష

  • అక్రమ ఆయుధాల కేసులో తీర్పును వెలువరించిన నాంపల్లి కోర్టు
  • ఏడాది జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా
  • గత ఐదేళ్లుగా జైల్లో ఉన్న భానుకిరణ్

సంచలనం సృష్టించిన మద్దెలచెరువు సూరి హత్యకేసులో ప్రధాన నిందితుడైన భానుకిరణ్ కు నాంపల్లి కోర్టు ఏడాది జైలు శిక్షను విధించింది. అక్రమ ఆయుధాల వినియోగం కేసులో ఈ శిక్షను ఖరారు చేసింది. దీనికి తోడు రూ. 10 వేల జరిమానా విధించింది. భానుతో పాటు మరో ఇద్దరికి కూడా ఇదే కేసులో శిక్షను విధించింది.

 2009లో అక్రమ ఆయుధాల కేసులో భానుకిరణ్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి విచారణ జరిపిన కోర్టు నేడు తీర్పును వెలువరించింది. మరోవైపు మద్దెలచెరువు సూరి హత్యకేసు విచారణ కూడా కొనసాగుతోంది. ఈ హత్య కేసుకు సంబంధించి గత ఐదేళ్లుగా భానుకిరణ్ జైల్లోనే ఉన్నాడు. 

More Telugu News