keerthi suresh: సావిత్రి పెదనాన్న పాత్రలో రాజేంద్ర ప్రసాద్

  • రేపు ప్రేక్షకుల ముందుకు 'మహానటి'
  • పాత .. కొత్త తరం నటీనటుల కలయిక 
  • అన్నివర్గాల ప్రేక్షకుల్లో ఆసక్తి
సావిత్రి అభిమానులంతా 'మహానటి' సినిమా కోసం ఎంతో ఆసక్తిగా .. ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. వాళ్ల నిరీక్షణకు తెరదించేస్తూ రేపు ఈ సినిమా విడుదల కానుంది. సావిత్రి జీవితంతో ముడిపడిన చాలా పాత్రలను ఈ సినిమాలో చూపించనున్నారు. ఆయా పాత్రలకి సంబంధించిన లుక్స్ ను ఇప్పటికే చాలావరకూ పరిచయం చేశారు.

తాజాగా కేవీ చౌదరి పాత్రకి సంబంధించిన ఒక వీడియోను వదిలారు. కేవీ చౌదరి సావిత్రికి పెదనాన్న. నటన వైపు సావిత్రి అడుగులు వేయడానికి కారకులు ఆయనే. ఆమెలోని ఉత్సాహాన్ని గమనించి నటన దిశగా ప్రోత్సహించింది ఆయనే. సావిత్రి కోట్లాదిమంది మనసులు దోచుకోవడం వెనుక ఆయన కృషి వుంది. అలాంటి కేవీ చౌదరి పాత్రను రాజేంద్ర ప్రసాద్ పోషించారు. ఈ పాత్రలో రాజేంద్రప్రసాద్ డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్నారు. పాత .. కొత్త తరం నటీనటుల కలయికగా రూపొందిన ఈ సినిమా, సంచలనానికి తెరతీస్తుందేమో చూడాలి.
keerthi suresh
rajendra prasad

More Telugu News