Amitabh Bachchan: వన్ ప్లస్ 6ను లీక్ చేసి నాలిక కరుచుకున్న అమితాబ్... వెంటనే డిలీట్ చేసినా స్క్రీన్ షాట్ వైరల్!

  • ఈనెల 17న విడుదల కానున్న వన్ ప్లస్ 6
  • అమితాబ్ కు చూపించిన సంస్థ సీఈఓ
  • ఆ చిత్రాన్ని పోస్టు చేసి సెకన్ల వ్యవధిలో డిలీట్ చేసిన బిగ్ బీ
ఈనెల 17వ తేదీన భారత మార్కెట్లో విడుదల కానున్న 'వన్ ప్లస్ 6' స్మార్ట్ ఫోన్ ను తనకు చూపించేందుకు సంస్థ వ్యవస్థాపక సీఈఓ పీటేలా వచ్చిన వేళ, ఆ స్మార్ట్ ఫోన్ ను పరిశీలిస్తూ తీసుకున్న ఫొటోను బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసుకున్నారు. ఈ ఫోన్ ను తొలిసారిగా లాంచింగ్ ఈవెంట్ లోనే పరిచయం చేయాలని సంస్థ భావించగా, అమితాబ్ చేసిన ట్వీట్ క్షణాల్లో వైరల్ కాగా, ఆయన వెంటనే దాన్ని తొలగించారు.సెకన్ల వ్యవధిలోనే అమితాబ్ తన ట్వీట్ ను తొలగించినప్పటికీ, అప్పటికే దాన్ని ఎంతో మంది రీట్వీట్ చేసుకున్నారు. స్క్రీన్ షాట్స్ తీసుకున్నారు. అమితాబ్ డిలీట్ చేసినా ఇప్పుడు వన్ ప్లస్ 6 చిత్రాలు వైరల్ అవుతున్నాయి. కాగా, అమితాబ్ తన స్వహస్తాలతో వన్ ప్లస్ 5 స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. 
Amitabh Bachchan
One Plus 6
Leak
Social Media
Twitter
Facebook

More Telugu News