S Gopal Reddy: కుక్కపిల్లను కాపాడేందుకు వెళ్లి.. కొట్టుకుపోయిన నిర్మాత ఎస్.గోపాల్ రెడ్డి కుమారుడు!

  • భార్గవ్ కు వాకాడు వద్ద రొయ్యల హ్యాచరీ
  • రాత్రి 11 గంటల సమయంలో సముద్రం వద్దకు వెళ్లిన భార్గవ్
  • ఓ కుక్కపిల్లను కాపాడే ప్రయత్నంలో సముద్రంలోకి
  • పోస్టుమార్టం అనంతరం మరిన్ని వివరాలు తెలుస్తాయంటున్న పోలీసులు

భార్గవ్ ఆర్ట్స్ పేరిట పేరిట చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన నిర్మాత ఎస్ గోపాల్ రెడ్డి తనయుడు బార్గవ్ రెడ్డి, ఈ ఉదయం అనుమానాస్పద స్థితిలో మరణించగా, ఆయన మరణానికి కారణం ఓ కుక్కపిల్లని తెలుస్తోంది. అందుబాటులోని మరింత సమాచారం ప్రకారం, చెన్నైలో నివాసం ఉంటున్న భార్గవ్ కు నెల్లూరు జిల్లా వాకాడు సమీపంలో రొయ్యల హ్యాచరీ ఉంది.

సోమవారం రాత్రి అక్కడికి వచ్చిన భార్గవ్, రాత్రి 11 గంటల సమయంలో సముద్రం వద్దకు వెళ్లి, ఉదయం మృతదేహమై కనిపించారు. ఓ కుక్కపిల్ల సముద్రపు కెరటాల ధాటికి కొట్టుకుపోతుండగా చూసిన భార్గవ్, కుక్కపిల్లను కాపాడేందుకు వెళ్లి కెరటాల వేగానికి సముద్రంలోకి కొట్టుకుపోయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన మృతదేహానికి పోస్టుమార్టం జరుగుతుండగా, అది పూర్తయితే భార్గవ్ మరణానికి ఇంకేమైనా కారణాలున్నాయా? అన్న విషయం వెల్లడవుతుందని పోలీసు వర్గాలు అంటున్నాయి.

More Telugu News