Supreme Court: సీజే అభిశంసన వ్యవహారంలో సుప్రీంలోనూ కాంగ్రెస్ కు చుక్కెదురు!

  • దీపక్ మిశ్రా అభిశంసనపై సుప్రీంలో కాంగ్రెస్ పిటిషన్
  • ఈ ఉదయం విచారించిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం
  • పిటిషన్ ను తోసిపుచ్చిన న్యాయమూర్తులు

చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాను అభిశంసించాలని రాజ్యసభలో నోటీసులిచ్చి విఫలమై, ఆపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ కు అక్కడా చుక్కెదురైంది. తమ నోటీసులపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ, పలువురు కాంగ్రెస్ ఎంపీలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఈ ఉదయం పిటినష్ ను విచారించిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం, దాన్ని తోసిపుచ్చింది.

నిబంధనల మేరకే ఉపరాష్ట్రపతి నిర్ణయం తీసుకుని ఉంటారని అభిప్రాయపడ్డ ధర్మాసనం, పిటిషన్ పై తదుపరి విచారణ ఉండబోదని స్పష్టం చేసింది. విషయాన్ని పార్లమెంట్ వేదికగానే తేల్చుకోవాలని సూచించింది. మీకు మీరుగానే పిటిషన్ ను వెనక్కు తీసుకోవాలని పేర్కొంది. ఆపై తమ పిటిషన్ ను విత్ డ్రా చేసుకుంటున్నామని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు.

More Telugu News