BJP: ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబుపై ఈసీ కి ఫిర్యాదు

  • అశోక్ బాబు ఒక ప్రభుత్వ ఉద్యోగి
  • కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఆయన ఎలా పాల్గొంటారు?
  • ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామంటున్న బీజేపీ  
ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబుపై బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని బీజేపీ నేత పృథ్వీరాజ్ తెలిపారు. ఈరోజు ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగి అయిన అశోక్ బాబు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఎలా పాల్గొంటారని ఆయన ప్రశ్నించారు. ఈ విషయమై భారత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని చెప్పారు.

రేపు అన్ని జిల్లాల కలెక్టరేట్లు ముట్టడిస్తాం

ఏపీకి ప్రత్యేక హోదా సాధనలో భాగంగా రేపు అన్ని జిల్లాల కలెక్టరేట్లను ముట్టడిస్తామని అశోక్ బాబు తెలిపారు. కర్ణాటకలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆందోళనలు చేపడతామని చెప్పారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయం గురించి వివరించేందుకే కర్ణాటకకు వచ్చామని చెప్పారు. నాడు సమైక్యాంధ్ర ఉద్యమంలో తమ వంతు పాత్ర పోషించామని, నేడు ప్రత్యేకహోదా కోసం చేస్తున్న పోరులో పాల్గొంటామని అన్నారు.
BJP
ap ngo
ashokbabu
prudhviraj

More Telugu News