railway: రేపటి నుంచి రైల్వే ఉద్యోగుల నిరాహార దీక్షలు

  • వేతన సంఘం సిఫారసులు అమలు చేయడం లేదు
  • దేశ వ్యాప్తంగా మూడు రోజుల నిరాహార దీక్షకు దిగుతాం
  • ఓ ప్రకటనలో ఆల్ ఇండియా రైల్వేమన్ ఫెడరేషన్

ఏడవ వేతన కమిషన్ సిఫారసులు అమలు చేయకపోవడం, రైల్వేను ప్రైవేటీకరించాలనే ఆలోచనను నిరసిస్తూ రైల్వే ఉద్యోగులు దేశ వ్యాప్తంగా మూడు రోజుల నిరాహార దీక్షకు దిగనున్నారు. ఈ మేరకు ఆల్ ఇండియా రైల్వేమన్ ఫెడరేషన్ (ఏఐఆర్ఎఫ్) ఓ ప్రకటన విడుదల చేసింది.

 వేతన సంఘం సిఫారసుల మేరకు మెరుగైన వేతనాలు ఇవ్వాలని, ఫిట్ మెంట్ ఫ్యాక్టర్, పెన్షన్ విషయాలకు సంబంధించి రైల్వే మంత్రి, సహాయ మంత్రి, ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించుకున్నా ప్రయోజనం లేదని ఏఐఆర్ఎఫ్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఏఐఆర్ఎఫ్ తో అనుసంధానమైన అన్ని సంఘాలు రేపటి నుంచి మూడు రోజుల పాటు వరుసగా నిరాహారదీక్షలకు దిగనున్నామని, దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే ఉద్యోగులు ఈ దీక్షల్లో పాల్గొంటారని చెప్పారు. 

More Telugu News