Supreme Court: సుప్రీంకోర్టు ముందుకు నేడు అభిశంసన తీర్మాన తిరస్కృతి కేసు

  • సీజేఐపై అభిశంసనను తిరస్కరించడాన్ని సవాల్ చేసిన కాంగ్రెస్
  • సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన కాంగ్రెస్ ఎంపీలు
  • విచారణ చేపట్టనున్నజస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వంలోని ధర్మాసనం

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ దీపక్ మిశ్రా అభిశంసనను రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు తిరస్కరించడంపై దాఖలైన పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం ఈరోజు విచారించనుంది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం విచారణ జరపనుంది. జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వంలోని జస్టిస్ ఎస్ ఏ బాబ్డే, జస్టిస్ ఎస్ వీ రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఏకే గోయల్ లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది. కాగా, సీజేఐ పై అభిశంసనను వెంకయ్యనాయుడు తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

More Telugu News