potti sri ramulu university: డబ్బు తీసుకుని ఓటు వేసే సంస్కృతి మారాలి: లక్ష్మీనారాయణ

  • రాజకీయమనేది వారసత్వం అయిపోతోంది
  • ప్రజాస్వామ్యం ఐదేళ్లకు ఓసారి వచ్చేది కాదు
  • ప్రజల నుంచి విధాన నిర్ణయాలు తీసుకోవాలి

రాజకీయమనేది వారసత్వం అయిపోతోందని, డబ్బు తీసుకుని ఓటు వేసే సంస్కృతి మారాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యం ఐదేళ్లకు ఓసారి వచ్చేది కాదని, ప్రజాస్వామ్యం అనేది ధనస్వామ్యం అయిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం ఉండాలని, ప్రజల నుంచి విధాన నిర్ణయాలు తీసుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.

 సామాజిక వర్గాలు, వ్యక్తి ఆరాధన ముఖ్యం కాదని చెప్పిన ఆయన, వ్యక్తిత్వ ఆరాధన, సమాజం ముఖ్యమని అన్నారు. కాగా, హైదరాబాద్ లోని పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్శిటీలో మోతీలాల్ నెహ్రూ స్మారకోపన్యాస కార్యక్రమాన్ని నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన లక్ష్మీనారాయణ ‘ప్రజాస్వామ్యం కలా? నిజమా?’ అనే అంశంపై మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News