Narendra Modi: మోదీ, అమిత్ షా, యడ్యూరప్పలకు లీగల్ నోటీసులు పంపిన సిద్ధరామయ్య
- తనపై అసత్య ఆరోపణలు చేశారన్న కర్ణాటక సీఎం
- బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్
- రూ.100 కోట్లకు పరువు నష్టం దావా?
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నందుకు గానూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, కర్ణాటక సీఎం అభ్యర్థి యడ్యూరప్పలపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పరువు నష్టం దావా వేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో వారికి లీగల్ నోటీసులు పంపించానని సిద్ధరామయ్య తెలిపారు.
తనపై ఆ ముగ్గురు బహిరంగంగా ఆరోపణలు చేశారు కాబట్టి, ప్రజల సమక్షంలోనే క్షమాపణలు చెప్పాలని, లేదంటే న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవాల్సిందేనని సిద్ధరామయ్య అన్నారు. వందల మందిని మోసం చేసిన విజయ్ ఈశ్వరన్ అనే వ్యాపారవేత్తను కర్ణాటక సీఎం రక్షించాలనుకుంటున్నారని బీజేపీ నేతలు ఇటీవల తీవ్ర ఆరోపణలు చేశారు. కాగా, సిద్ధరామయ్య రూ.100 కోట్లకు దావా వేయనున్నట్టు సమాచారం.