gonuguntla suryanarayana: సైకిల్ యాత్రలో మరో అపశ్రుతి.. అస్వస్థతకు గురై కుప్పకూలిన ధర్మవరం ఎమ్మెల్యే

  • 10 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టిన గోనుగుంట్ల సూర్యనారాయణ
  • వడదెబ్బకు గురైన ఎమ్మెల్యే
  • హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు

ఏపీకి ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశం పార్టీ సైకిల్ ర్యాలీలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ర్యాలీలో కొన్ని అపశ్రుతులు దొర్లుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మండుతున్న ఎండల్లో కొనసాగుతున్న ఈ యాత్రల్లో టీడీపీ నేతలు అస్వస్థతకు గురవుతున్నారు.

తాజాగా ఈ రోజు ధర్మవరంలో సైకిల్ యాత్ర చేస్తుండగా ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ వడదెబ్బకు గురయ్యారు. మార్గమధ్యంలోనే కుప్పకూలిపోయారు. వెంటనే టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పోతకుంట గ్రామం నుంచి ధర్మవరం పట్టణానికి ఈ ఉదయం ఆయన 10 కిలోమీటర్ల యాత్రను చేపట్టారు. ఈ సందర్భంగానే ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఇటీవలే ఎంపీ మాగంటి బాబు కూడా సైకిల్ యాత్ర సందర్భంగా అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News