mosquito: దోమలను చంపడానికి విమానాల్లో ఎలక్ట్రిక్‌ బ్యాట్లు!

  • ఇండిగో ఎయిర్‌లైన్స్ నిర్ణయం
  • దోమల బెడదపై ఫిర్యాదులు వస్తుండడంతో చర్యలు
  • ఈ నెల నుంచే వినియోగం
ఇంట్లో దోమలను చంపడానికి చాలా మంది ఎలక్ట్రిక్‌ బ్యాట్లను ఉపయోగించడం చూస్తూనే ఉంటాం. తమ విమానాల్లోనూ దోమల బెడద ఉందని తెలియడంతో వాటిల్లోనూ ఆ తరహా బ్యాట్లను ఉపయోగించాలని ఇండిగో ఎయిర్‌లైన్స్ నిర్ణయం తీసుకుంది. ఒక్కో విమానానికి రెండు ఎలక్ట్రిక్‌ బ్యాట్ల చొప్పున క్యాబిన్‌ సిబ్బంది వీటిని ఉపయోగించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

విమానాల్లో దోమలు ఉంటున్నాయంటూ కొందరు ఫిర్యాదు చేయడంతో, వాటిని క్లీన్ చేయడానికి కొన్నిసార్లు విమానాలను ఆలస్యంగా నడపాల్సి వచ్చిందని, అందుకే ఇటువంటి నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఈ బ్యాట్లను అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగిస్తామని, ఈ నెల నుంచే వాటిని వినియోగిస్తామని తెలిపారు.
mosquito
airplane
bats

More Telugu News