vijay devarakonda: హిట్ కాంబినేషన్లో మరో మూవీకి రంగం సిద్ధం!

  • అభిరుచిగల నిర్మాతగా రాజ్ కందుకూరి 
  • కథానాయకుడిగా విజయ్ దేవరకొండ 
  • దర్శకుడిగా వివేక్ ఆత్రేయ    
యూత్ కోరుకునే కొత్తదనం కలిగిన కథలను ఎంచుకోవడంలోను .. టాలెంట్ వున్న కొత్త దర్శకులను ప్రోత్సహించడంలోను నిర్మాత రాజ్ కందుకూరి ముందుంటారు. 'పెళ్లి చూపులు' .. 'మెంటల్ మదిలో' సినిమాలు అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 'పెళ్లి చూపులు' సినిమాను విజయ్ దేవరకొండతోను .. 'మెంటల్ మదిలో సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రేయతోను ఆయన రూపొందించారు.

 ఈ రెండు సినిమాలు నిర్మాతగా రాజ్ కందుకూరి అభిరుచికి అద్దం పట్టాయి. తాజాగా ఈ ముగ్గురి కాంబినేషన్లో ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గా రాజ్ కందుకూరి .. వివేక్ ఆత్రేయ కలిసి, విజయ్ దేవరకొండకి ఒక కథను వినిపించారట. కాన్సెప్ట్ కొత్తగా ఉండటం వలన విజయ్ దేవరకొండ వెంటనే అంగీకరించాడని అంటున్నారు. ఇతర వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
vijay devarakonda
raj kandukuri

More Telugu News