honor 10: హువావే నుంచి మరో హైఎండ్ ఫోన్... ఈ నెల 15న 'ఆనర్ 10' విడుదల

  • అదే రోజు నుంచి విక్రయాలు
  • 4జీబీ ర్యామ్, 6జీబీ ర్యామ్ లలో లభ్యం
  • ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్ తయారీ సంస్థ హువావే తన ఆనర్ బ్రాండ్ పై ఆనర్ 10 పేరుతో ఓ స్మార్ట్ ఫోన్ ను ఈ నెల 15న విడుదల చేయనుంది. ఫ్లిప్ కార్ట్ లో ఈ మేరకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో మాత్రమే లభించనుంది. ఈ నెల 15 నుంచి అమ్మకాలు మొదలవుతాయని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. దీని ధర గురించి ఫ్లిప్ కార్ట్ లో సమాచారం లేదు.

అయితే, 4జీబీ ర్యామ్, 64జీబీ వేరియంట్ ధర చైనాలో 2,599 యువాన్లుగా ఉంది. మన కరెన్సీలో సుమారు రూ.27,000. అదే, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర చైనాలో 2,999 యువాన్లు. మన కరెన్సీలో సుమారు రూ.31,500. మన దగ్గర కూడా ఇంచుమించు ఈ స్థాయిలోనే ధరలు ఉండొచ్చని భావించొచ్చు.

ఆనర్ 10లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన పలు ఫీచర్లను జోడించారు. ఇది గ్లాస్ బాడీతో ఉంటుంది. 5.84 అంగుళాల 1080 ఎల్ సీడీ స్క్రీన్, కిరిన్ 970 ఎస్ వోసీ, ఆండ్రాయిడ్ ఓరియో 8.1 ఆపరేటింగ్ సిస్టమ్, వెనుక 24 మెగాపిక్సల్ కెమెరా, 16మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, ముందు 24మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 3,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు.

More Telugu News