Supreme Court: ఏపీ పునర్విభజన చట్టంపై దాఖలైన పిటిషన్ పై ‘సుప్రీం’లో విచారణ ప్రారంభం

  • కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ
  • ఇప్పటివరకు అమలు చేసిన వాటి వివరాలు చెప్పండి
  • కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన అత్యున్నత న్యాయస్థానం
  • నాలుగు వారాల గడువు కోరిన కేంద్రం

ఏపీ పునర్విభజన చట్టంపై టీ - కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఇప్పటివరకు అమలు చేసిన వాటి వివరాలు తెలియజేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ వివరాలు సమర్పించేందుకు నాలుగు వారాల గడువు కావాలని సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో ఈ కేసు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది.  

  • Loading...

More Telugu News