Tollywood: నేను బీజేపీలో చేరినంత మాత్రాన నా క్యారెక్టర్ పోతుందా?: నటి మాధవీలత

  • బీజేపీలో మాధవీలత చేరడంపై నెటిజన్ల విమర్శలు
  • దీటుగా సమాధానమిచ్చిన నటి
  • ఎవరిష్టం వాళ్లది. ఒక్కొక్కరికీ ఒక్కో ఇష్టం ఉంటుంది 

నటి మాధవీలత బీజేపీలో చేరడంపై నెటిజన్లు పలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ వ్యాఖ్యలపై మాధవీలత తనదైన శైలిలో సమాధానమిచ్చింది. ‘నేను కొన్ని కామెంట్స్ చదివాను.. తప్పేమీ లేదు. మీకు నచ్చని పార్టీలో నేను చేరితే తిడతారా? మా కుటుంబంలో అమ్మానాన్న, అన్నలు, నేను.. మొత్తం ఐదుగురం. అందరం తలో పార్టీకి చెందిన వాళ్లం ... ఎవరిష్టం వాళ్లది. ఒక్కొక్కరికీ ఒక్కో ఇష్టం. పార్టీలో చేరినంత మాత్రాన ఇన్నాళ్ల నుంచి ఉన్న నా క్యారెక్ట ర్ పోతుందా? పుట్టి పెరిగిన ఇన్నేళ్లలో నాలో ఉన్న వ్యక్తిత్వాన్ని ఒక పార్టీ మార్చేస్తుందా?.. అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ నేనూ నా ఆలోచనలు మంచి చెయ్యాలనే తప్ప, ఇంకోటి తెలియదు..’ అని మాధవీలత చెప్పుకొచ్చింది.

కాగా, కేంద్ర మంత్రి, బీజేపీ నేత నితిన్ గడ్కరీ రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో పర్యటించిన విషయం తెలిసిందే. ఆయన సమక్షంలో మాధవీలత బీజేపీలో చేరింది. ఈ విషయాన్ని తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా తెలియజేస్తూ సంబంధిత ఫొటోలు పొందుపరిచింది. 

  • Loading...

More Telugu News