Karnataka: కన్నడ రాజకీయాల్లో పెను సంచలనం... అంబరీష్ తో కుమారస్వామి రహస్య చర్చలు!

  • గతంలో కాంగ్రెస్ టికెట్ ఇస్తే నిరాకరించిన అంబరీష్
  • ఓ అపార్టుమెంట్ లో కుమారస్వామితో భేటీ
  • కొత్త చర్చలకు తెరలేపిన వ్యవహారం
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినా వద్దని చెబుతూ, రాజకీయాలకు దూరం అవుతున్నానని చెప్పిన ప్రముఖ కన్నడ నటుడు అంబరీష్ ను జేడీ (యస్) అధ్యక్షుడు కుమారస్వామి కలవడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనమైంది. నిన్న రేస్ కోర్సు రోడ్డులోని ఓ అపార్టుమెంట్ లో అంబరీష్, కుమారస్వామిల మధ్య రహస్య చర్చలు జరిగాయి.

వీరిద్దరి భేటీ కన్నడ రాజకీయాల్లో కొత్త చర్చలకు తెరలేపగా, ఆయన కాంగ్రెస్ ను వీడి జేడీ (యస్)కు దగ్గరవుతారా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. వీరిద్దరి మధ్యా జరిగిన చర్చలకు సంబంధించిన వివరాలు వెల్లడి కాలేదు. కాగా, మాండ్య అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ను ఖరారు చేసినా అంబరీష్ తిరస్కరించిన సంగతి తెలిసిందే.
Karnataka
Ambarish
Kumaraswamy

More Telugu News