Adilabad District: చారిత్రక నాగోబా ఆలయాన్ని కూల్చివేయనున్న గ్రామస్తులు..పునర్నిర్మాణానికి ఏర్పాట్లు పూర్తి!

  • ఇంద్రవెల్లి మండలం కేశ్లాపూర్ గ్రామంలో ఉన్న నాగోబా ఆలయం
  • శాంతిపూజలు నిర్వహిస్తున్న గోండు పెద్దలు, పూజారులు
  • పాత ఆలయం స్థానే నూతన ఆలయం నిర్మించనున్న మెశ్రం వంశస్తులు

ఆదిలాబాద్ జిల్లాలోని చారిత్రక నాగోబా ఆలయ పునర్నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇంద్రవెల్లి మండలం కేశ్లాపూర్ గ్రామంలో ఉన్న ఈ ఆలయాన్ని మరి కాసేపట్లో గ్రామస్తులు కూల్చివేయనున్నారు. పాత నాగోబా ఆలయం స్థానే నూతన ఆలయాన్ని నిర్మించేందుకు, ఆలయ నిర్వాహకులైన మెశ్రం వంశస్తులు సిద్ధమయ్యాయరు. ఈ నేపథ్యంలో గోండు పెద్దలు, పూజారులు శాంతిపూజలు నిర్వహిస్తున్నారు.

కాగా, నూతన ఆలయ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిధులిచ్చేందుకు ముందుకొచ్చినా మెశ్రం వంశస్థులు సున్నితంగా తిరస్కరించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి నిధులు తీసుకుంటే ఆ శాఖ ప్రభావం తమ సంస్కృతీ సంప్రదాయాలపై పడుతుందని, అందుకే తిరస్కరించామని ఆ వంశస్థులు చెప్పడం గమనార్హం. వంశస్తుల నుంచి విరాళాల రూపేణా సేకరించిన కోటిరూపాయలతో విశాలమైన నూతన ఆలయాన్ని అదే స్థలంలో నిర్మించనున్నారు.  

More Telugu News