Chandrababu: ఎన్టీఆర్ కు, చంద్రబాబుకు తేడా అదే!: ఏపీ మంత్రి చినరాజప్ప

  • ఎన్టీఆర్ అయితే నిర్ణయం తొందరగా చెప్పేస్తారు
  • చంద్రబాబు అలా కాదు..ఆలోచిస్తారు
  • బీజేపీ కంట్రోల్ లో జగన్ ఉన్నారు
  • బీజేపీ గ్రాఫ్ పడిపోవడంతో పవన్ కల్యాణ్ ఆలోచనలో పడ్డారు

నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు, ప్రస్తుత సీఎం చంద్రబాబుకు ఉన్న తేడాను ఏపీ హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప విడమరచి చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘ఎన్టీఆర్ అయితే నిర్ణయం తొందరగా చెప్పేస్తారు. చంద్రబాబు అయితే ఆలోచిస్తారు. అందరూ మన మనుషులే..మనతో ఉన్నారు..నచ్చజెప్పాలని చంద్రబాబు చూస్తారు. చంద్రబాబుది చాలా మంచితనం. ఆయనతో చాలా మంది చనువుగా ఉంటారు’ అని అన్నారు.

ఏపీలో త్వరలో ఎన్నికలు జరుగుతాయి కనుక, ప్రతి ఎమ్మెల్యే పరిస్థితి ఎలా ఉందో చంద్రబాబు సర్వే చేయిస్తున్నారని.. ఈ మేరకు ఆయన నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ గురించి ఆయన మాట్లాడుతూ, బీజేపీ కంట్రోల్ లో జగన్ ఉన్నారని విమర్శించారు. బీజేపీ-వైసీపీ కలిసే ఉన్నాయనడానికి చాలా సంఘటనలు నిదర్శనమని అన్నారు. బీజేపీ గ్రాఫ్ పడిపోవడంతో పవన్ కల్యాణ్ కూడా ఆలోచనలో పడ్డారని, బీజేపీతో వెళితే తాను కూడా మునిగిపోతానని ఆయన భావించారని, ఆపై ఏ నిర్ణయం తీసుకుంటారో మరి! అని చెప్పుకొచ్చారు.

More Telugu News