bjp: బీజేపీకి బుద్ధి చెప్పేందుకు తెలుగు ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నారు: పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి

  • ఏపీని మోసగించిన బీజేపీకి బుద్ధి చెప్పాలి
  • కర్ణాటకలోని తెలుగు వాళ్లందరూ కాంగ్రెస్ కే ఓటెయ్యాలి
  • సిద్ధరామయ్య ప్రభుత్వానికే మళ్లీ అధికారం దక్కడం ఖాయం
ఏపీని మోసగించిన బీజేపీకి బుద్ధి చెప్పేందుకు కర్ణాటకలోని తెలుగు వాళ్లందరూ సిద్ధంగా ఉన్నారని పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి అన్నారు. ఏపీసీసీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన్ని ఘనంగా సన్మానించారు. అనంతరం, మీడియాతో నారాయణస్వామి మాట్లాడుతూ, కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తెలుగువాళ్లందరూ ఓటు వేసి బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని కోరారు.

విభజన హామీలు అమలు కానందువల్లే రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కు స్పష్టమైన మెజారిటీ రావడం ఖాయమని, సిద్ధరామయ్య ప్రభుత్వానికే మళ్లీ పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని, రాహుల్ ప్రధాన మంత్రి అవుతారని, ఏపీకి ప్రత్యేకహోదా ఫైలుపై తొలిసంతకం చేస్తారని చెప్పుకొచ్చారు.  
bjp
Congress
pondichery
cm narayanaswamy

More Telugu News