avanthi srinivas: విశాఖకు రైల్వే జోన్ కోసం: అనకాపల్లి ఎంపీ ఒక్కరోజు దీక్ష విరమణ

  • విశాఖకు రైల్వే జోన్ ఇవ్వాలని చేపట్టిన ఒక్కరోజు దీక్ష విరమణ
  • బీజేపీ నమ్మకద్రోహం చేసింది
  • హామీలు నెరవేర్చని పక్షంలో మరిన్ని ఉద్యమాలు చేపడతాం
విశాఖకు రైల్వే జోన్ ఇవ్వాలని కోరుతూ అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాస్ (అవంతి శ్రీనివాస్) ఈరోజు ఉదయం చేపట్టిన ఒక్కరోజు దీక్ష ముగిసింది. విశాఖ రైల్వేస్టేషన్ లో ఒక్కరోజు మెరుపు దీక్ష చేసిన అవంతి శ్రీనివాస్ కు సీపీఐ నేత సత్యనారాయణమూర్తి నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. అనంతరం, రైల్వే స్టేషన్ నుంచి డివిజినల్ రైల్వే మేనేజర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు.

 ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, విభజన చట్టంలోని హామీలు నెరవేర్చడానికి బీజేపీకి ఉన్న ఇబ్బందులేమిటని ప్రశ్నించారు. బీజేపీని నమ్మవద్దని వామపక్షాలు ముందుగానే హెచ్చరించాయని..వారు చెప్పినట్టే జరిగిందని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయని బీజేపీ నమ్మకద్రోహం చేసిందని, హామీలు నెరవేర్చని పక్షంలో మరిన్ని ఉద్యమాలు చేపడతామని, అందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
avanthi srinivas
visaka

More Telugu News