YSRCP: చివరకు, న్యాయవాదులను సైతం చంద్రబాబు మోసం చేశారు! : వైఎస్ జగన్

  • కృష్ణా జిల్లా కౌతవరంలో న్యాయవాదులతో జగన్ భేటీ
  • అధికారంలోకొస్తే న్యాయవాదులకు వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేస్తాం
  • అడ్వకేట్లుగా ఎన్ రోల్ అయిన వారికి రూ.5 వేలు ఇస్తాం
  • ప్రమాదవశాత్తు అడ్వకేట్లు మరణిస్తే రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లిస్తాం
చివరకు న్యాయవాదులను సైతం మోసం చేసిన ఘనత సీఎం చంద్రబాబుదని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. కృష్ణాజిల్లా కౌతవరంలో న్యాయవాదులతో జగన్ ఈరోజు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా న్యాయవాదులు తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ మేరకు ఓ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, అందరినీ మోసం చేసినట్టే, న్యాయవాదులను కూడా చంద్రబాబు మోసం చేశారని అన్నారు.

 వైసీపీ అధికారంలోకి వస్తే.. న్యాయవాదుల కోసం రూ.100 కోట్లతో వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేస్తామని, అడ్వకేట్లుగా ఎన్ రోల్ అయిన వారికి రూ.5 వేలు ఇస్తామని, ప్రమాదవశాత్తు అడ్వకేట్లు మరణిస్తే వారి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లిస్తామని, ఏపీలో హైకోర్టు ఎక్కడ వస్తుందో చూసి, చుట్టుపక్కల లాయర్లకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
YSRCP
Jagan
lawyers

More Telugu News