Madhya Pradesh: లైనేస్తే ఇట్టే పడిపోయే మన అమ్మాయిలు... మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు!

  • 18 ఏళ్లకన్నా లోపే పెళ్లి చేసేయాలి
  • అప్పుడే తప్పుడు ఆలోచనలు రావు
  • అగర్ మాల్వా ఎమ్మెల్యే గోపాల్ వ్యాఖ్యలపై దుమారం
కాసేపు మంచిగా మాట్లాడితే మన అమ్మాయిలు ఇట్టే పడిపోతారని, పారిపోయి పెళ్లిళ్లు చేసుకుంటున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్, అగర్ మాల్వా బీజేపీ ఎమ్మెల్యే గోపాల్ పర్మర్, అమ్మాయిలకు 18 ఏళ్లలోపే వివాహం చేసేస్తే సమస్య ఉండదని అన్నారు. వివాహార్హత వయసును 18 ఏళ్లుగా నిర్ణయించడమే కొంప ముంచుతోందని అభిప్రాయపడ్డ ఆయన, ముస్లింలు తమ పేర్లు మార్చుకుని తియ్యగా ట్రాప్ చేస్తుంటే అమ్మాయిలు పడిపోతున్నారని, వారిలో ఆలోచించే శక్తి కూడా లేకుండా పోతోందని అన్నారు.

తనకు 12 ఏళ్లకే పెళ్లయిందని గుర్తు చేసిన ఆయన, బాల్యవివాహాలను ప్రోత్సహించడం లేదని అంటూనే, చిన్న వయసులో పెళ్లిళ్లు చేస్తే అమ్మాయిల్లో తప్పుడు ఆలోచనలు రావని వ్యాఖ్యానించారు. కాగా, పర్మర్ వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. ఆయన మాటలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ముస్లిం సంఘాలు భోపాల్ హైవేను దిగ్బంధించాయి. ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి.
Madhya Pradesh
Gopal Parmer
BJP
Child Marriage
Girl Trap
Love Jihad

More Telugu News