rachakonda: బ్యాంకు ఖాతాదారులకు రాచకొండ పోలీసుల సూచనలు

  • సైబర్‌ నేరాల నివారణకు సూచనలు
  • అంతర్రాష్ట్ర ముఠాల మోసాలు
  • బ్యాంకు అకౌంట్‌, పిన్‌ నెంబర్లు చెప్పొద్దని సూచనలు
సైబర్‌ నేరాల నివారణకు సూచనలు చేస్తూ రాచకొండ పోలీసులు ప్రజలకు ఓ లేఖ రాశారు. ఇటీవలి కాలంలో అంతర్రాష్ట్ర ముఠాలు తప్పుడు దృవపత్రాలతో మొబైల్‌ సిమ్‌ కార్డులు తీసుకుని.. బ్యాంకు ఖాతాదారులకు ఫోన్‌ చేస్తున్నారని అందులో తెలిపారు. తాము బ్యాంకు మేనేజర్లమంటే పరిచయం చేసుకుని, బ్యాంకు అకౌంట్‌, ఏటీఎం కార్డు వివరాలు అప్‌డేట్ చేస్తున్నామని పేర్కొంటూ.. అకౌంట్‌ నెంబరు, కార్డ్‌ నెంబరు, సీవీవీ నెంబరు, ఓటీపీ చెప్పమంటున్నారని అటువంటి వారి మాటలు నమ్మకూడదని తెలిపారు. ఇటువంటి వివరాలు ఎవ్వరూ చెప్పకూడదని పేర్కొంటూ రాచకొండ పోలీసులు సమగ్రంగా అన్ని వివరాలను కమీషనర్‌ ఆఫ్‌ పోలీస్‌, రాచకొండ పోలీస్‌ కమీషన్‌ పేరిట ఆ లేఖలో చెప్పారు.                                                           
rachakonda
Police
bank

More Telugu News