soundarya: సౌందర్య చనిపోయిందంటే నమ్మలేకపోయాను: ఇంద్రజ

  • సౌందర్య ఎంతో ఫ్రెండ్లీగా ఉండేది 
  • సినిమాల గురించే మాట్లాడుకునే వాళ్లం 
  • ఆమె మరణాన్ని జీర్ణించుకోలేకపోయాను

తెలుగు తెరపై సందడి చేసిన నిన్నటి తరం అందమైన కథానాయికలలో ఇంద్రజ ఒకరు. సౌందర్యతో కలిసి ఆమె కొన్ని సినిమాల్లో నటించారు. తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూ లో ఇంద్రజ మాట్లాడుతూ ఉండగా సౌందర్య ప్రస్తావన వచ్చింది. అప్పుడామె తనదైన శైలిలో స్పందిస్తూ .. " సౌందర్య చాలా ఫ్రెండ్లీగా ఉండేది .. అలా అని చెప్పేసి ఆమె అదే పనిగా మాట్లాడేది కాదు"

"అలాంటి సౌందర్య చనిపోయిందనే సరికి ఆ న్యూస్ కరెక్ట్ కాదనుకున్నాను .. కాకూడదనుకున్నాను. ఎవరైనా శాడిజంతో ఈ వార్తను ప్రచారంలోకి తెచ్చారా? అనిపించింది. ఆమె నిజంగానే లేరనే విషయాన్ని జీర్ణించుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. షూటింగు సమయంలో తాము చేస్తోన్న సినిమాలను గురించి .. కాస్ట్యూమ్స్ గురించి .. మేకప్ గురించి మాట్లాడుకునేవాళ్లం. ఆమె దూరం కావడం నిజంగా బాధాకరం .. అలాంటి మరణం ఎవరికీ రాకూడదనే ఇప్పటికీ అనుకుంటూ వుంటాను" అని చెప్పుకొచ్చారు.   

  • Loading...

More Telugu News