sushanth: రానా చేతుల మీదుగా టీజర్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు

  • మెగాఫోన్ చేతబట్టిన రాహుల్ రవీంద్రన్ 
  • సుశాంత్ జోడీగా రుహని 
  • నమ్మకంతో వున్న రాహుల్      

విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకున్న రానా, సాధ్యమైనంత త్వరగా వాటిని పూర్తి చేసే పనిలో వున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన చేతుల మీదుగా తమ సినిమా టీజర్ ను రిలీజ్ చేయించడానికి నిర్మాతలు భరత్ కుమార్ .. హరి సన్నాహకాలు చేసుకుంటున్నారు.

వీరి నిర్మాణంలో సుశాంత్ హీరోగా రాహుల్ రవీంద్రన్ 'చి .. ల .. సౌ' అనే సినిమాను రూపొందిస్తున్నాడు. హీరోగా రాహుల్ రవీంద్రన్ కి గుర్తింపు వుంది. ఓ వైపున సరైన పాత్రల కోసం వెయిట్ చేస్తూనే, మరో వైపున మెగాఫోన్ చేతబట్టుకున్నాడు. సుశాంత్ .. రుహని జంటగా నటిస్తోన్న ఈ సినిమా నుంచి, ఈ నెల 7వ తేదీ సాయంత్రం 5 గంటలకు టీజర్ ను వదులుతున్నారు. ఈ టీజర్ తోనే సినిమాపై అందరిలో ఆసక్తిని పెంచాలనే ఉద్దేశంతో టీమ్ వుంది. సుశాంత్ కి ఈ సినిమా సక్సెస్ ను ఇస్తుందనే నమ్మకంతో రాహుల్ రవీంద్రన్ వున్నాడు.  

  • Loading...

More Telugu News