gali janardhan reddy: ‘గాలి’పై కేసులను ఎత్తి వేసేలా బీజేపీ ఒత్తిడి చేస్తోంది : వర్ల రామయ్య

  • న్యాయస్థానాలపై బీజేపీ ఒత్తిడి తెస్తోంది
  • కర్ణాటకలో అధికారం కోసం అవినీతిపరులతో బీజేపీ కలుస్తోంది
  • జగన్ జీవితం జైలుమయం కాబోతోంది
మైనింగ్ దిగ్గజం గాలి జనార్దన్ రెడ్డిపై ఉన్న అక్రమాస్తుల కేసులను నిర్వీర్యం చేసేందుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)పై భారతీయ జనతా పార్టీ ఒత్తిడి చేస్తోందని ఏపీ టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కర్ణాటకలో అధికారం సాధించేందుకని అవినీతిపరులతో బీజేపీ స్నేహం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ఖనిజ సంపదను కొల్లగొట్టిన గాలి జనార్దన్ రెడ్డి కుటుంబసభ్యులను బీజేపీ భుజాలకెత్తుకుందని ఆరోపించారు. అక్రమాస్తులకు సంబంధించి గాలి జనార్దన్ రెడ్డి, వైసీపీ అధినేత జగన్ పై ఉన్న కేసులను నీరు గారుస్తూ, న్యాయస్థానాలపై బీజేపీ ఒత్తిడి తెస్తోందని, ఆ పార్టీ ఎన్నిప్రయత్నాలు చేసినా వారిని కాపాడలేదని, జగన్ జీవితం జైలుమయం కాబోతోందని అన్నారు.
gali janardhan reddy
varla ramaiah

More Telugu News