shruthihassan: ‘గ్యాంగ్ స్టర్’ సెట్ కు వచ్చిన తన తల్లిని చూసి శ్రుతిహాసన్ సంతోషం!

  • మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘గ్యాంగ్ స్టర్’
  • సెట్ కు వెళ్లిన శ్రుతిహాసన్ తల్లి సారిక
  • సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఫొటో
ప్రముఖ నటుడు కమలహాసన్, సారికల కూతురు శృతిహాసన్ ప్రస్తుతం బాలీవుడ్ మూవీ 'గ్యాంగ్ స్టర్'లో నటిస్తోంది. నటుడు, దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఈ సినిమా సెట్ కు శృతిహాసన్ తల్లి సారిక వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా, సెట్ కు వచ్చిన తన తల్లిని చూసిన శృతిహాసన్ సంతోషానికి అవధుల్లేవు. ఈ సందర్భంగా సారికను చిత్ర యూనిట్ ఆప్యాయంగా పలకరించింది. ఇందుకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. కాగా, తన నటనపై తల్లి సాగరిక అభిప్రాయం చెప్పడం ఎన్నటికీ మరిచిపోలేని అనుభవమని శృతిహాసన్ చెప్పింది. దర్శకుడు మహేశ్ తో తన తల్లికి పరిచయం ఉందని, ఆయన సూచనలతో నటిస్తున్న తనను ఆమె అభినందించిందని శృతిహాసన్ సంతోషం వ్యక్తం చేసింది. 
shruthihassan
gangster set
sarika

More Telugu News