kaala: చెన్నై వేదికగా 'కాలా' ఆడియో వేడుక!

  • ఈనెల 9న చెన్నైలోని వైఎమ్‌సీఏ నంద‌నంలో ఆడియో వేడుక
  • ఇప్ప‌టికే కాలా షూటింగ్ పూర్తి
  • జూన్ 7న విడుద‌ల
పా రంజిత్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కాలా చిత్రం ఆడియో వేడుక ఈనెల 9న చెన్నైలోని వైఎమ్‌సీఏ నంద‌నంలో జరగనుంది. రీసెంట్‌గా ఈచిత్రం నుండి య‌మ గ్రేట్ అంటూ సాగే మాస్ పాటని విడుద‌ల చేయగా అది అభిమానులను అలరించింది. ప్రస్తుతం యూఎస్ లో ఉన్న రజనీ ఆడియో వేడుక లోపు తిరిగి చెన్నై రానున్నారు. వండ‌ర్ బార్ ఫిలింస్ బేన‌ర్‌పై ధ‌నుష్ నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయ‌ణ్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూన్ 7న విడుద‌ల చేయనున్నారు.
kaala
rajanikanth
Tollywood
kollywood
Hyderabad
chennai

More Telugu News