Pawan Kalyan: సివిల్స్‌ ర్యాంకర్‌ పృథ్వీ తేజను గతంలో అభినందించిన ఫొటోను పోస్ట్ చేసిన పవన్‌

  • సివిల్స్‌ ఫలితాల్లో పృథ్వీకి 24వ ర్యాంకు 
  • గతంలో ఐఐటీ జేఈఈలోనూ టాపర్‌
  • సివిల్స్‌లో తెలుగు రాష్ట్రాల ర్యాంకర్లను అభినందించిన పవన్
ఇటీవల ప్రకటించిన సివిల్స్‌ ఫలితాల్లో మెరుగైన ర్యాంకులు సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అభినందనలు తెలుపుతున్నట్లు ట్వీట్‌ చేశారు. ఈ ఫలితాల్లో 24వ ర్యాంకు సాధించిన పథ్వీ తేజ గతంలో ఐఐటీ జేఈఈ టాపర్‌గా కూడా నిలిచాడని, ఆ సమయంలో తాను పృథ్వీని కలిశానని పవన్ తెలిపారు. అందుకు సంబంధించిన ఫొటోను కూడా పవన్‌ పోస్ట్‌ చేయడం విశేషం.

సివిల్స్‌లో కూడా పృథ్వీకి 24వ ర్యాంకు రావడం చూసి ఆశ్చర్యపోయానని పవన్‌ అన్నారు. సివిల్స్‌లో ర్యాంకులు సాధించిన అందరికీ ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నట్లు పవన్‌ పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణల్లో ర్యాంకులు సాధించిన వారి పేర్లను, వారికి వచ్చిన ర్యాంకులను కూడా పవన్‌ పోస్ట్ చేశారు. కాగా, పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలకు చెందిన పృథ్వీ తేజ ఐఐటీ పూర్తి చేసి రూ.కోటి వేతనం అందే ఉద్యోగాన్ని వదులుకొని సివిల్ సర్వీసెస్‌ పరీక్షలు రాసిన విషయం తెలిసిందే.  
Pawan Kalyan
Jana Sena
civils

More Telugu News