girl: అసోం పోలీస్ క్వార్టర్ లో బాలికపై అత్యాచారం.. పోలీస్ అరెస్ట్

  • అసోంలోని హజో పోలీస్ క్వార్టర్ లో ఘటన
  • మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ ఆగ్రహం
  • కాపాడాల్సిన పోలీసులే ఇలాంటి పని చేస్తారా అంటూ మండిపాటు
బాలికలు, మహిళలపై అత్యాచారాలకు అంతే లేకుండా పోతోంది. వీరిని కాపాడాల్సిన ఖాకీలు కూడా అత్యాచారాలకు తెగబడుతుండటం ఆందోళన కలిగించే అంశం. అసోంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. హజో పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న బినోద్ కుమార్ దాస్ పోలీస్ క్వార్టర్లో ఒక బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ నేపథ్యంలో బినోద్ కుమార్ ను అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.

ఈ ఘటనపై అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ స్పందిస్తూ, దారుణానికి ఒడిగట్టిన పోలీసుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలకు భద్రత కల్పించడం పోలీసుల పని అని... పోలీసులే ఇలాంటి చర్యలకు పాల్పడటం తీవ్రమైన నేరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని అన్నారు.
girl
rape
police
assam
tarun gogoi

More Telugu News